శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Sep 12, 2020 , 16:48:18

డ్ర‌గ్స్ టెస్టు కోసం శాంపిల్ అడిగితే.. మూత్రంలో నీళ్లు క‌లిపిన రాగిణి ద్వివేది

డ్ర‌గ్స్ టెస్టు కోసం శాంపిల్ అడిగితే.. మూత్రంలో నీళ్లు క‌లిపిన రాగిణి ద్వివేది

బెంగళూరు : డ‌్ర‌గ్స్ రాకెట్ కేసులో సెప్టెంబ‌ర్ 4న క‌న్న‌డ న‌టి రాగిణి ద్వివేదిని అరెస్టు చేశారు. డ్ర‌గ్స్ ప‌రీక్ష కోసం రాగిణిని శాంపిల్ అడిగితే.. మూత్రంలో నీటిని క‌లిపి వైద్యులకు అందజేసినట్లు తెలిసింది. ప్రస్తుతం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అదుపులో ఉన్న రాగిణి ద్వివేదిని టెస్టు కోసం గురువారం బెంగళూరు మల్లేశ్వరంలోని కేసీ జనరల్ ద‌వాఖాన‌కు తరలించినట్లు స‌మాచారం. అయితే రాగిణి ఇచ్చిన శాంపిల్ కలుషితమైందని వైద్యులు గుర్తించి.. కేసు ద‌ర్యాప్తు చేప‌డుతున్న సీసీబీ అధికారికి స‌మాచారం ఇచ్చారు. సాధారణంగా మూత్రంలో నీరు కలిపినప్పుడు అధిక ఉష్ణోగ్రతను త‌గ్గించి శరీర ఉష్ణోగ్రతకు సమానంగా చేస్తుంది.

ఆమె మోసం గురించి అప్రమత్తమైన సీసీబీ అధికారి రాగిణి ద్వివేదిని మళ్లీ ప‌రీక్ష కోసం శాంపిల్ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఈసారి ఆమె మూత్రానికి నీళ్లు క‌లిపిందా లేదా నిర్ధార‌ణ చేసుకొని త‌మ‌కు చెప్పాల‌ని అధికారి వైద్యుల‌కు సూచించారు. రాగిణి పోలీస్‌ కస్టడీని పొడిగించాలని కోరుతూ ఉన్న‌తాధికారుల‌ను సెంట్రల్ ఏజెన్సీ కోర‌డంతో.. మ‌రో మూడు రోజుల పాటు ఆమెను క‌స్ట‌డీలోనే ఉంచ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఈ కేసులో మొత్తం 15 మంది పేర్లు రాగా.. వారిలో పోలీసులు పట్టుకున్న మొదటి ప్రధాన పాత్ర‌ధారి న‌టి రాగిణి ద్వివేది. ఆమె తరువాత కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన న‌టి సంజ‌న గల్రానీని అదుపులోకి తీసుకొని డ్ర‌గ్స్ టెస్టు కోసం తీసుకెళ్లింది. అయితే ఆమె పరీక్ష చేయటానికి నిరాకరించింది. కానీ తరువాత పోలీసుల ఆదేశాల మేర‌కు సంజ‌న నుంచి శాంపిల్ స్వీక‌రించి టెస్టు కోసం ల్యాబ్‌కు పంపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo