శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Jul 23, 2020 , 19:20:08

ఆదిలాబాద్ జిల్లాలో కరోనాతో ఏఎస్ఐ మృతి

ఆదిలాబాద్ జిల్లాలో కరోనాతో ఏఎస్ఐ మృతి

ఆదిలాబాద్ : జిల్లాలోని ఖానాపూర్ ప్రాంతానికి చెందిన నజీబ్ మహ్మద్ ఖాన్ (46) పట్టణంలోని వన్ టౌన్ లో ఏఎస్ఐగా పని చేస్తున్నాడు. నిన్న సాయంత్రం చాతి నొప్పితో అస్వస్థకు గురైన ఏఎస్ఐ చికిత్స కోసం రిమ్స్ లో చేరాడు. చికిత్స అందించిన డాక్టర్లు ముందు జాగ్రత్తలో భాగంగా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ రోజు తీవ్ర అస్వస్థతకు గురైన మహ్మద్ ఖాన్ మరణించారు. కాగా, నిన్న సేకరించిన నమూనాల షాంపిల్స్ రిపోర్ట్స్ రాగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన పనిలేదని, జాగ్రత్తలు పాటించి అధిగమించ వచ్చని వైద్యులు సూచించారు.


logo