శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Crime - Jan 24, 2021 , 19:47:39

రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ డేవిడ్‌ మృతి

రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ డేవిడ్‌ మృతి

ఆదిలాబాద్‌ : రోడ్డు ప్రమాదంలో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఏఎస్‌ఐ) వి. ఎబినెజెర్‌ అలియాస్‌ డేవిడ్‌(54) మృతిచెందారు. డేవిడ్‌ ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తున్నాడు. నేరడిగొండ ఎస్‌ఐ సుమన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కాగజ్‌నగర్‌కు చెందిన డేవిడ్‌ నేరడిగొండ మండల హెడ్‌క్వార్టర్స్‌లో స్థిరపడ్డాడు. 1989 బ్యాచ్‌ అధికారి. భార్యతో కలిసి బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డేవిడ్‌ తలకు తీవ్ర గాయమవగా భార్య స్వల్ప గాయాలతో బయటపడింది. వెంటనే చికిత్స నిమిత్తం నిర్మల్‌ జిల్లా కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతిచెందారు. భార్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. దంపతులకు ఇద్దరు కొడుకులు. జిల్లా ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్‌ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డిపార్ట్‌మెంట్‌ అనుభవం, నిజాయితీ గల వ్యక్తిని కోల్పోయిందని పేర్కొన్నారు.  

VIDEOS

logo