గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Aug 22, 2020 , 13:42:22

ఆటో ధ్వంసం.. రౌడీ షీట‌ర్‌పై కేసు న‌మోదు

ఆటో ధ్వంసం.. రౌడీ షీట‌ర్‌పై కేసు న‌మోదు

హైద‌రాబాద్ : ఆటోను ధ్వంసం చేసిన కేసులో ఓ రౌడీ షీట‌ర్‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని కాల‌ప‌త్త‌ర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... మ‌హ్మ‌ద్ వాజిద్ అనే రౌడీ షీట‌ర్ బియానీ షా టెక్రీ ప్రాంతానికి స‌హ‌చ‌రుల‌తో క‌లిసి వెళ్లాడు. కాగా అక్క‌డ పార్క్ చేసిన ఓ ఆటోను ధ్వంసం చేశాడు. య‌జ‌మాని వ‌చ్చి అడ‌గ‌గా చంపుతాన‌ని బెదిరింపుల‌కు గురిచేశాడు. దీంతో బాధితుడు పోలీసుల‌ను ఆశ్ర‌యించి ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసిన పోలీసులు నిందితుడిని ప‌ట్టుకునేందుకు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.


logo