మంగళవారం 04 ఆగస్టు 2020
Crime - Jul 06, 2020 , 17:52:16

నిషేధిత పురుగుల మందులను విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్

నిషేధిత పురుగుల మందులను విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్

ఖమ్మం : నిషేధిత పురుగుల మందులను నిల్వ చేసి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని బోనకల్లు మండలం రవినూతల చెందిన దుగ్గి హనుమంత రావు, చెన్నా సుధీర్ గ్రామంలో నిబంధనలు అతిక్రమించి నిషేధిత పురుగుల మందులను నిల్వ చేసి  విక్రయిస్తున్నారనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు.   సోదాల్లో  ఐదు లక్షల యాభై నాలుగు వేల రూపాయల విలువ గల 1280 లీటర్లు (128 కార్టన్లు) గ్లైఫోసేట్ అనే నిషేధిత పురుగు మందులను గుర్తించి సీజ్ చేశారు. చట్టపరమైన చర్యల నిమిత్తం బోనకల్లు పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ తెలిపారు. తనిఖీల్లో ఎస్‌ఐ రఘు కానిస్టేబుల్  శ్రీనివాస్, రామకృష్ణ, కోటేశ్వర్, రవి పాల్గొన్నారు.

నిషేధిత గుట్కా పట్టివేత..

ఖమ్మం పట్టణంలోని చర్చి కాంపౌండ్ చెందిన  ఎస్కే దర్గయ్య తన ఇంట్లో నిషేధిత గుట్కా ప్యాకెట్లు అక్రమంగా నిల్వ వుంచి విక్రయిస్తునట్లు సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ రవికుమార్ తన సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. లక్షా ఆరువై ఆరు వేల రూపాయల విలువ గల గుట్కాను గుర్తించి సీజ్ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు తెలిపారు.
logo