బుధవారం 28 అక్టోబర్ 2020
Crime - Sep 27, 2020 , 18:22:34

బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్

బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్

ఖమ్మం : ఐపీఎల్‌ నేపథ్యంలో క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు  వ్యక్తులను ఆదివారం  టాస్క్ ఫోర్స్  పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు  తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని  బ్యాంక్ కాలనీకి చెందిన సుగళ అక్షయ లింగం ఆధ్వర్యంలో ..షేక్ ఆరిఫ్, జెల్లా అఖిల్. ఐపీఎల్  బెట్టింగ్ ను తమ ఫోన్‌పే, గూగుల్ పే ఖాతాల ద్వారా నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో 12 మందితో రూ. 2,10,51 లావాదేవీలు నిర్వహించినట్లు తెలిపారు. టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారం మేరకు సీఐ  వెంకట్ స్వామి, ఎస్‌ఐ ప్రసాద్, కానిస్టేబుల్  రామారావు, కళింగరేడ్డి బెట్టింగ్ పాల్పడుతున్న ముగ్గురుని పట్టుకున్నారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


logo