బుధవారం 27 జనవరి 2021
Crime - Dec 30, 2020 , 16:02:04

బంగారం అపహరించిన దొంగల అరెస్ట్‌

బంగారం అపహరించిన దొంగల అరెస్ట్‌

మహబూబ్‌నగర్ : జిల్లాలో సంచలనం సృష్టించిన మిడ్జిల్ పి.ఎస్. పరిధిలోని బోయిన్‌పల్లిలో జరిగిన బంగారు ఆభరణాల దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో ఎస్పీ రెమా రాజేశ్వరి కేసు వివరాలను వెల్లడించారు. ఇటీవల వివాహం జరుగాల్సిన ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తుండగానే బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లడం సంచలనం కలిగించింది.


ఈ కేసులో పోలీసులు శరవేగంగా స్పందించి సుమారు రూ. 30 లక్షల విలువ చేసే 61 తులాల బంగారు నగలు, రూ. 2.80లక్షల నగదు, దొంగతనం చేయడానికి ఉపయోగించిన రెండు బైకులు, ఒక ఆటోతో సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ఒక నిందితుడి కోసం గాలిస్తున్నారు. అంతకుముందు ఈ 2020 ఏడాదిలో నేరాల నిరోధన కోసంజిల్లా పోలీసులు చేసిన కృషిని, ముఖ్యంగా కొవిడ్ మహమ్మారి నిరోధనలో పోలీసుల పనితీరును ఎస్పీ ప్రశంసించారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు, డీఎస్పీలు జి.శ్రీధర్, శ్రీ కె.రామ్ కుమార్‌, సంబంధిత పోలీసు స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.


logo