చిరిగిపోయిన పాత బ్యాగులు ఏంపనికొస్తయి అనుకుంటున్నారా?… ఈ ఫొటో చూడండి… కారేమో పెద్దదే… వెనకాల చూస్తే ఓ పాత బ్యాగు.. ఇదేంది.. కారులో చోటులేక ఎనకాల తగిలించారనుకుంటున్నారా?…
అదేం కాదు. దీని వెనకాల పెద్ద మతలబు ఉన్నది. ఈ మధ్య ట్రాఫిక్ చలాన్ తప్పించుకోవడానికి జనాలు తమ బుర్రలకు పదును పెడుతున్నారు. నెంబర్ప్లేట్ను ఇరగ్గొట్టడం, నెంబర్ను సగం గీకేయడం, వెనకాల కూర్చునేవారు కాలు అడ్డం పెట్టి కెమెరాకు చిక్కకుండా జాగ్రత్త పడటం, బండిపై వెనక మహిళలు కూర్చున్నపుడు కొందరు చీర కొంగు, లేదా చున్నీతో నెంబర్ ప్లేటును కవర్ చేసి చలాన్ పడకుండా తప్పించుకుంటున్నారు.
ఈ ట్రిక్స్ అన్ని పోలీసులకు తెలిసిపోయాయి. అందుకే కొత్తగా ఆలోచించాడు ఓ ఇంటెలిజెంట్. పాతబ్యాగ్తో నెంబర్ప్లేట్ను కవర్ చేశాడు. ఏప్రిల్ 16 తారీఖున సుమారు మధ్యాహ్నం 12గంటల సమయంలో నిమ్స్ ఆసుపత్రి వెనకాల, జీవీకే డౌన్లో తీసిన ఫొటో ఇది.