శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Jun 16, 2020 , 16:01:34

హాలియాలో పేకాట రాయుళ్ల అరెస్ట్

హాలియాలో పేకాట రాయుళ్ల అరెస్ట్

నల్లగొండ : జిల్లాలోని హాలియాలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నగదు, సెల్ ఫోన్లు, బైకులు కూడా స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎస్ఐ జే.శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో  హాలియా పట్టణంలోని సాగర్ రోడ్డులో గల బాలాజీ ఇంజినీరింగ్ అండ్ రోలింగ్ షట్టర్ షాపులో పేకాట అడుతున్నట్లు సమాచారం అందింది. తమ సిబ్బందితో కలిసి అక్కడ తనిఖీలు చేయగా ఆరుగురు వ్యక్తులు పేకాట ఆడుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 48,600/- రూపాయల నగదు, 6 సెల్ ఫోన్స్, మూడు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఎవరైనా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.


logo