మంగళవారం 04 ఆగస్టు 2020
Crime - Aug 02, 2020 , 19:12:33

మోహన్ బాబు కుటుంబ సభ్యులను బెదిరించిన వ్యక్తుల అరెస్ట్

మోహన్ బాబు కుటుంబ సభ్యులను బెదిరించిన వ్యక్తుల అరెస్ట్

హైదరాబాద్ : నిన్న రాత్రి జల్పల్లి లోని మోహన్ బాబు ఇంటికి ఇన్నోవా కారు (AP31an 0004 )లో వచ్చి  ఆగంతకులు హల్ చల్ చేశారు. మోహన్ బాబు ఇంటికి వచ్చి మిమ్మల్ని వదలమని దుండగలు బెదిరించారు. భయాందోళ చెందిన మోహన్ బాబు కుటుంబ సభ్యులు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు. దర్యాప్తు చేపట్టారు.

సీసీటీవీ, కార్ నెంబర్ ఆధారంగా ఆగంతకులను పోలీసులు పట్టుకున్నారు. మోహన్ బాబు ఇంటికి వచ్చింది. మైలార్ దేవ్ పల్లి లోని దుర్గా నగర్ కు చెందిన యువకులుగా గుర్తించారు. ప్రస్తుతం నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసున్నారు. వారి కాల్ డేటాను పరీశీలిస్తున్నారు. కావాలని చేసారా?ఎవరైనా పంపించారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.logo