ప్రజలను మోసం చేస్తున్న ముఠా సభ్యుల అరెస్టు

ఖమ్మం రూరల్ : జిల్లాలో అక్రమంగా వ్యాపారం చేసి, నమ్మిన వారిని రూ.కోట్లలో మోసగించిన ముఠా సభ్యుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసినట్లు ఖమ్మం రూరల్ సీఐ సత్యనారయణరెడ్డి తెలిపారు. రూరల్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు విలేకరుల సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని భవానీనగర్‌కు చెందిన పురాణం శివకుమారి అనే మహిళ తన ముగ్గురు కుమారులతో కలిసి ఖమ్మం జిల్లాలోని కొన్ని సంస్థలకు నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్నట్లుగా చెప్పుకునేది.
కొందరు వ్యాపారులను, రైతులను మోసగించింది. రూ.కోట్లలో పెసలు, కందిపప్పు, బియ్యంతో పాటు ఇంకా ఎన్నో రకాల వస్తువులు తీసుకునేది. రూ.4 వడ్డీ ఇస్తానని అందిన కాడికి డబ్బు తీసుకునేది. వస్తువులు తీసుకునేందుకు, వ్యాపారులను నమ్మించేందుకు ముందుగా కొంత డబ్బును చెల్లించేది. తర్వాత ఇచ్చిన డబ్బు తిరిగిరాకపోవడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు ఆమెను విచారించగా ఇదిగో ఇస్తా, అదిగో ఇస్తా అని కాలం వెల్లబుచ్చేది.
దీంతో విసుగు చెందిన ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురంలోని రాఘవేంద్రనగర్‌కు చెందిన మాలోతు సునీత అనే బాధితులరాలు రూ. 70 లక్షలు ఇచ్చి మోస పోయినట్లుగా ఫిర్యాదు పోలీసులకు చేయడంతో విచారణ చేపట్టామని సీఐ తెలిపారు. కేసును ప్రత్యేకంగా స్వీకరించి ఖమ్మం రూరల్ పోలీసులతో పాటు టాస్క్‌పోర్స్ బృందం సహకారంతో కేసులో నిందితురాలి కుమారులైన ఎ2 నిందితుడు పురాణం శివ, ఎ3 నిందితుడు పురాణం శంకర్‌ను ఆదివారం పక్కా సమాచారం మేరకు అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో ఎ1 నిందితురాలు పురాణం శివకుమారి, ఎ4 నిందితుడు పురాణం గోపి కృష్ణ పరారీలో ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో రూరల్ ఎస్.ఐ. రవూఫ్, సిబ్బంది ఉన్నారు.
తాజావార్తలు
- మరో నాలుగు రోజులు..
- గ్రామాల అభివృద్ధేప్రభుత్వ ధ్యేయం
- ‘పట్టభద్రుల’ ఓటర్లు 4,91,396
- నేటి నుంచి నిరంతరాయంగా..
- ఆకాశం హద్దుగా!
- పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం
- కోడేరు అభివృద్ధ్దికి కంకణం కట్టుకున్నా
- ప్రభుత్వభూమి ఆక్రమణపై హైకోర్టును ఆశ్రయిస్తాం
- కాళేశ్వరంలో మళ్లీ జలసవ్వడి
- నల్లమల ఖ్యాతి నలుదిశలా విస్తరించాలి