మంగళవారం 26 జనవరి 2021
Crime - Oct 07, 2020 , 18:45:35

క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠా అరెస్ట్‌

క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠా అరెస్ట్‌

ఖమ్మం సిటీ/కల్లూరు: ఖమ్మం నగరంలో క్రికెట్‌ బెట్టింగ్‌ పాల్పడుతున్న ఇద్దరిని బుధవారం టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ గంటా వెంకట్రావ్‌ నేతృత్వంలో సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. ఖమ్మం నగరంలోని వన్‌టౌన్‌కు చెందిన బొడ్డులూరి సురేష్‌ అనే వ్యక్తి బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది బుధవారం అతని ఇంట్లో సోదాలు నిర్వహించారు.

సురేష్‌తో పాటు పాటు బెట్టింగ్‌ పాల్పడుతున్న గడ్డే రాఘవరావును అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 20 వేల నగదు, రెండు సెల్‌ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. కాగా పోలీసులకు చిక్కిన ఇద్దరు నిందితులు కోనేరు శ్రీనివాసరావు, కాసర్ల శరత్‌, డీ సురేష్‌ అనే మరో ముగ్గురితో కలిసి సుమారు రూ.24వేలు ఐపీఎల్‌ బెట్టింగ్‌కు సంబంధించి లావాదేవీలు జరిపినట్లు విచారణలో తేలిందని టాస్క్‌ఫోర్స్‌ బృందం తెలిపింది. నిందితులు ఇద్దరిని ఖమ్మం వన్‌టౌన్‌ పోలీసులకు అప్పగించారు. 


logo