జడ్చర్లలో బ్యాటరీల దొంగల అరెస్ట్

Sep 25, 2020 , 17:44:11

మహబూబ్ నగర్ : భారీ వాహనాల బ్యాటరీలను తస్కరించడమే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను జడ్చర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జడ్చర్ల, నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో భారీ వాహనాల బ్యాటరీలు, ఓ ఆటో, మూడు ద్విచక్రవాహనాలను దొంగిలించిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 

వీటి విలువ సుమారు రూ. 5 లక్షల వరకు ఉంటుందని మహబూబ్ నగర్ డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు. మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన విష్ణు, సులేమాన్, నవీన్ కలిసి ఈ దొంగతనాలకు పాల్పడినట్లు డీఎస్పీ తెలిపారు. జడ్చర్లలో వాహనాల తనిఖీలో విష్ణు అనే నిందితుడు పట్టుబడగా..అతడు ఇచ్చిన సమాచారం మేరకు మిగతా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD