గురువారం 21 జనవరి 2021
Crime - Oct 28, 2020 , 18:21:34

బ్యాంకు దోపీడీలకు పాల్పడుతున్న దొంగల అరెస్ట్‌

బ్యాంకు దోపీడీలకు పాల్పడుతున్న దొంగల అరెస్ట్‌

మెదక్ : జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు మెదక్ డీఏస్పీ కృష్ణమూర్తి తెలిపారు. టేక్మాల్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన వివరాలను వెల్లడించారు. టేక్మాల్ మండలం మెరుగువాని కుంట తండాకు చెందిన దేవసూత్ రాజు అలియాస్ బుట్ట, దేవసూత్ రాజు ఇరువురు వరుసకు బాబాయ్, కొడుకు. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలను ఎంచుకున్నారు. ఈ క్రమంలో పెద్ద శంకరంపేట, టేక్మాల్, నారాయణఖేడ్, హత్నూర, నర్సాపూర్, వట్ పల్లి, మెదక్ టౌన్ , పాపన్నపేట్, జోగిపేట్ పోలిస్ స్టేషన్ల పరిధిలలోని బ్యాంకులు,  వైన్స్, ఫర్తిలైజర్స్, కిరాణం దుకాణాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు.

గత ఏడాది నవంబర్22న పెద్దశంకరంపేట్ ఎస్‌బీఐ బ్యాంక్‌లో రూ.25వేలు చోరీ చేశారు. ఈ ఏడాది జూన్ 10న టేక్మాల్ వైన్స్‌లో రూ.30వేలు, జులై 8న నారాయణఖేడ్ వైన్స్ లో రూ.12వేలు, జులై 11న హత్నూర లోని కిరాణా షాపులో రూ.73వేలు, జులై 20న నర్సాపూర్ వైన్స్ లో 3వేలు, ఫెర్టిలైజర్ షాప్‌లో రూ.98,200వేలు, జులై 30న వట్టిపల్లి లో రూ.15వేలు, ఆగస్టు 17న మెదక్ ఆటోమొబైల్ షాపులో రూ.50వేలు, అక్టోబర్7 జోగిపేట లో మూడున్నర తులాల బంగారం దొంగిలించారు. 


జూన్ 25 టేక్మాల్ లోని ప్రాథమిక సహకార బ్యాంకులో, జులై 13న పాపన్నపేట సహకార బ్యాంకు లో, సెప్టెంబర్28న యూసుఫ్ పేటలోని గ్రామీణ వికాస్ బ్యాంక్ లో చోరీకి యత్నించారు. వీరిద్దరిని టెక్నాలజీ సహాయంతో బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్నామని వివరాలను వెల్లడించారు. వారి వద్ద నుంచి లక్షా ఐదు వేల నగదు, రెండున్నర తులాల బంగారం, తొమ్మిదిన్నర తులాల వెండి  చైన్లు రికవరీ చేసి నేరస్తులను రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ పేర్కొన్నారు.


logo