ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jul 15, 2020 , 18:57:45

మార్ఫింగ్‌తో యువతులను మోసం చేస్తున్న యువకుడి అరెస్టు

మార్ఫింగ్‌తో యువతులను మోసం చేస్తున్న యువకుడి అరెస్టు

గుంటూరు: యువతుల ఫోటోలను మార్ఫింగ్‌ చేస్తూ వారిని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం పుర్లమెర గ్రామానికి చెందిన చిన్న రఘుబాబు అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కోచిలో యానిమేషన్‌ను నేర్చుకున్న రఘుబాబు  సాంకేతికతను సద్వినియోగించుకోకుండా యువతుల ఫోటోలను మార్ఫింగ్‌కు పాల్పడుతూ వారిని బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతూ వస్తున్నాడు.

దాదాపు 10 మంది మహిళలు ఈయన బారిన పడినట్లు జిల్లా ఎస్పీ విశాల్‌ గున్ని తెలిపారు.ఇన్‌స్ట్రాగామ్‌ నుంచి యువతుల ఫోటోలను తీసి మార్ఫింగ్‌ చేస్తున్నట్లు గుర్తించామని ఆయన వివరించారు.  నకిలీ సిమ్‌ కార్డును కొనుగోలు చేసి అమ్మాయిలకు బెదిరిస్తున్నారని అన్నారు. ప్రజలు ఆన్‌లైన్‌ వ్యవహారాలతో జాగ్రత్తగా ఉండాలని , వ్యక్తిగత సమాచారం, లోకేషన్‌ ఎవరికి ఇవ్వవద్దని సూచించారు.

ఏమైనా సైబర్‌ సమస్యలుంటే సైబర్‌ మిత్రకు ఫోన్‌ చేయాలని సూచించారు. రఘుబాబును అరెస్టు చేసి సైబర్‌ కేసులను నమోదు చేశామని ఎస్పీ వెల్లడించారు. 


logo