బుధవారం 20 జనవరి 2021
Crime - Dec 06, 2020 , 11:36:13

గుజ‌రాత్‌లో ఘోరం.. 20 దుకాణాలు ద‌గ్ధం

గుజ‌రాత్‌లో ఘోరం.. 20 దుకాణాలు ద‌గ్ధం

అహ్మ‌దాబాద్ : గుజ‌రాత్ అహ్మ‌దాబాద్‌లోని బాపున‌గ‌ర్ ఏరియాలోని శ్యామ్ శిఖ‌ర్ కాంప్లెక్స్‌లో ఆదివారం ఉద‌యం అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో మొత్తం 20 దుకాణాలు పూర్తిగా ద‌గ్ధ‌మ‌య్యాయి. ప్ర‌మాద‌స్థ‌లికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపు చేసింది. భారీగా ఆస్తి న‌ష్టం సంభ‌వించింద‌ని దుకాణ య‌జ‌మానులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయితే అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంద‌ని ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారి రాజేశ్ భ‌ట్ తెలిపారు. 


logo