శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Aug 21, 2020 , 14:35:13

ఆర్మీ ట్రక్కు పల్టీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు

ఆర్మీ ట్రక్కు పల్టీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు

మండి : హిమాచ‌ల్‌ ప్రదేశ్‌ రాష్ర్టం మండి జిల్లాలోని పాధర్ ప్రాంతంలో ఆర్మీ సైనికులు ప్రయణిస్తున్న ట్రక్కు పల్టీ కొట్టడంతో ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. పాధర్ ప్రాంతంలో ఆర్మీ ట్రక్కు గురువారం అదుపుతప్పి ఒక్కసారిగా కొండమీదికి దూసుకెళ్లడంతో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ఆర్మీ సిబ్బంది తీవ్రంగా గాయపడగా వారిని వెంటనే దవాఖానకు తరలించినట్లు మండి జిల్లా ఎస్పీ గురుదేవ్‌ చంద్‌ శర్మ తెలిపారు. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo