లద్దాఖ్‌లో ఆర్మీ జవాన్ వీరమరణం

ఆసిఫాబాద్ : లద్దాఖ్‌లో కొండ చరియలు విరిగిపడి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ అమరుడయ్యాడు. చైనా బార్డర్‌లోని లాహ ఏరియాలో విధులు నిర్వరిస్తూ షకీర్ హుస్సేన్ శనివారం కొండ చరియలు విరిగి పడి మృత్యువాత పడ్డాడు. ఆర్మీ వాహనంలో వెళ్తుండగా సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు షకీర్ తల్లిదండ్రులకు ఆర్మీ అధికారులు సమాచారం అందించారు. జిల్లాలోని కాగజ్‌నగర్ పట్టణంలోని రిక్షా కాలనీకి చెందిన షకీర్ హుస్సేన్ ఇంటర్ చదువుతున్న సమయంలోనే 2001 లో ఆర్మీలో చేరాడు. షకీర్‌కు నిఖిత్ ఫాతిమాతో 2007లో వివాహమైంది. ఇద్దరు కొడుకులు ఇద్దరు, కూతుళ్లు ఉన్నారు. షకీర్ గత ఆరు నెలల క్రితం ఇంటికి వెళ్లాడు. తాజాగా రెండు రోజుల కిందట తండ్రి హుస్సేన్ తల్లి జంషీద్ సుల్తానా, భార్య నిఖిత్ ఫాతిమాతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. కొడుకు మరణ వార్త విని అతని తల్లిదండ్రులు బోరున విలపించారు. దేశభక్తితో ఆర్మీలో చేరిన షకీర్ హుస్సేన్ ఎప్పుడు కాగజ్‌నగర్‌కు వచ్చిన అందరితో కలిసి ఉండేవాడని, ఆర్మీలో విధులు నిర్వహిస్తూ ప్రమాదంలో చనిపోవడం చాలా బాధ కలిగించిందని అతని స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు. జవాన్ మృతితో కాగజ్‌నగర్‌లో విషాదం నెలకొంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఎములాడలో దంతెవాడ ఎమ్మెల్యే పూజలు
- శ్రీలంక జలాల్లో మునిగిన భారత ఫిషింగ్ బోట్
- హెచ్-1బీ కోసం ఓపీటీ దుర్వినియోగం: దర్యాప్తుకు అమెరికా సిద్ధం!
- ’అల్లుడు అదుర్స్’ కలెక్షన్లలో వెనకబడిందా..?
- భద్రాద్రి కొత్తగూడెంలో తొలిసారిగా బాలల అదాలత్
- ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
- దాహం తీర్చే యంత్రం.... వచ్చేసింది..!
- కామెడీ టచ్‌తో ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్
- ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు భారత జట్టు ప్రకటన
- వైట్‌హౌస్‌కు ఆ పేరెలా వచ్చింది.. దాని చరిత్ర గురించి మీకు తెలుసా!