సోమవారం 25 జనవరి 2021
Crime - Dec 16, 2020 , 13:19:14

అత్యాచారం కేసులో ఆర్మీ క‌ల్న‌ల్ అరెస్ట్

అత్యాచారం కేసులో ఆర్మీ క‌ల్న‌ల్ అరెస్ట్

కాన్పూర్ : అత్యాచారం కేసులో ఆర్మీ క‌ల్న‌ల్ నీర‌జ్ గెహ్లాట్‌ను కాన్పూర్‌లోని కంటోన్మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. ఆర్మీ క‌ల్న‌ల్ సెల్‌ఫోన్ లోకేష‌న్ ఆధారంగా అత‌న్ని అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. విచార‌ణ చేప‌ట్టిన అనంత‌రం ఆర్మీ క‌ల్న‌ల్‌ను కోర్టులో హాజ‌రు ప‌ర‌చ‌నున్నారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఆర్మీ ఉద్యోగి నీర‌జ్ గెహ్లాట్‌కు లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ నుంచి క‌ల్న‌ల్‌గా ప‌దోన్న‌తి ల‌భించింది. దీంతో త‌న స్నేహితుడితో పాటు అత‌ని భార్య‌ను ఆర్మీ ఉద్యోగి విందుకు ఆహ్వానించాడు. ఇక భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ క‌లిసి కంటోన్మెంట్‌లోని ఆఫీస‌ర్స్ మెస్‌కు విందుకు వెళ్లారు. అక్క‌డికి వెళ్లిన త‌ర్వాత ఇద్ద‌రికీ మ‌త్తు పానీయాలు ఇచ్చాడు ఆర్మీ ఉద్యోగి. ఆ త‌ర్వాత స్నేహితుడి భార్య‌పై ఆర్మీ క‌ల్న‌ల్ అత్యాచారం చేశాడు. త‌మ‌కు జ‌రిగిన ఘోర అవ‌మానంపై బాధితురాలి భ‌ర్త కంటోన్మెంట్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసుల‌కు ద‌ర్యాప్తు చేప‌ట్టి ఆర్మీ ఆఫీస‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు ర‌ష్య‌న్ సంత‌తికి చెందిన మ‌హిళ‌. 


logo