ఆదివారం 24 జనవరి 2021
Crime - Dec 09, 2020 , 20:43:13

తుపాకులతో బెదిరించి గోల్డ్ షాప్‌లో దోపిడీ

తుపాకులతో బెదిరించి గోల్డ్ షాప్‌లో దోపిడీ

పాట్నా: తుపాకులతో బెదిరించిన దుండగులు ఒక గోల్డ్‌ షాప్‌లో దోపిడీ చేశారు. బీహార్‌లోని దర్భంగలో బుధవారం ఈ ఘటన జరిగింది. సాయుధ దుండగులు పగటిపూట అందరూ చూస్తుండగా ఒక ఆభరణాల దుకాణంలో బంగారం, నగదు దోచుకున్నారు.  అనంతరం గన్స్‌ చూపుతూ పారిపోయారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళన చెందారు. కొందరు తమ షాపులను మూసివేశారు. 14 కిలోల బంగారం, రూ .2 లక్షల నగదును దుండగులు దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ దృశ్యాల ద్వారా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo