బుధవారం 03 మార్చి 2021
Crime - Jan 22, 2021 , 15:12:47

భార్గవ్‌ రామ్‌ బెయిల్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

భార్గవ్‌ రామ్‌ బెయిల్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

హైదరాబాద్‌ :  బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో భార్గవ్‌ రామ్ ముందస్తు పిటిషన్‌పై సికింద్రాబాద్‌ కోర్టులో వాదనలు ముగిశాయి. బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు సాయంత్రం నిర్ణయం తీసుకోనున్నది. ప్రవీణ్‌రావు సోదరుల కిడ్నాప్‌ కేసులో భార్గవ్‌ రామ్‌కు ఎలాంటి సంబంధం లేదని, బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరుఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. కాగా భార్గవ్‌ రామ్‌కు బెయిల్‌ ఇవ్వొద్దని పోలీసులు కోరారు. 

అపహరణ కేసులో ఆయన ఏ-3 నిందితుడిగా ఉన్నట్లు తెలిపారు.  అతడిని విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కేసులో మరికొంత మందిని అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలను విన్న కోర్టు బెయిల్‌ పిటిషన్‌పై సాయంత్రం నిర్ణయం తీసుకోనుంది. దీంతో భార్గవ్‌ రామ్‌కు కోర్టు బెయిల్‌ ఇస్తుందా.. ఇవ్వదా అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కిడ్నాప్‌ కేసు వెలుగులోకి వచ్చిన నాటి నుంచి భార్గవ్‌ రామ్‌ పరారీలో ఉన్న విషయం తెలిసిందే.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo