మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Jul 07, 2020 , 12:46:57

ఏపీ మంత్రి బాలినేని ఎస్కార్ట్ వాహనం బోల్తా..ఒకరి మృతి

ఏపీ మంత్రి బాలినేని ఎస్కార్ట్ వాహనం బోల్తా..ఒకరి మృతి

హైదరాబాద్ : అబ్దుల్లా పుర్ మెట్ పోలీసు స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్ పేట్ ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఎస్కార్ట్ వాహనం బొలేరో టైర్ బ్లాస్ట్ అవ్వడంతో పల్టీకొడుతూ కిందపడింది. వాహనంలో ఉన్న పాపయ్య అనే హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని హయత్ నగర్ లోని హాస్పిటల్ కి తరలించారు. గచ్చిబౌలి నుంచి విజయవాడ కి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


logo