బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Aug 19, 2020 , 19:03:25

గ‌ర్భిణి గేదేను చంపేశారు..

గ‌ర్భిణి గేదేను చంపేశారు..

తిరువ‌నంత‌పురం : కేర‌ళ‌లో మ‌రో ఘోరం చోటు చేసుకుంది. గ‌ర్భిణితో ఉన్న ఏనుగును చంపిన ఘ‌ట‌న మ‌రువ‌క ముందే.. అలాంటి ఘ‌ట‌నే మ‌రొక‌టి వెలుగు చూసింది. మ‌ల‌ప్పురం జిల్లాలోని ఓ అడ‌వి బ‌ర్రెను(గ‌ర్భిణి) ఐదుగురు దుండ‌గులు క‌లిసి చంపారు. అడ‌వి బ‌ర్రె అదృశ్యంపై అట‌వీశాఖ అధికారులు స‌మీప ప్రాంతాల్లోని నివాసాల్లో త‌నిఖీలు చేశారు. ఓ ఇంట్లో బ‌ర్రె మాంసం దొర‌క‌గా.. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అలా కేసును చేధించారు. ఐదుగురు క‌లిసి బ‌ర్రెను చంపి ఆ మాంసాన్ని వండుకుని తిన్న‌ట్లు అధికారులు నిర్ధారించారు. ఓ నిందితుడి నివాసంలో 25 కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల‌ను బుధ‌వారం మ‌ల‌ప్పురం కోర్టులో ప్ర‌వేశ‌పెట్టారు. 

జూన్ 3వ తేదీన 15 సంవ‌త్స‌రాల ఏనుగును(గ‌ర్భిణి) హ‌త్య చేసిన సంగ‌తి తెలిసిందే. పైనాపిల్‌లో ప‌టాకులు ఉంచి తినిపించ‌డంతో ఆ ఏనుగు మృతి చెందింది. 


logo