శుక్రవారం 05 మార్చి 2021
Crime - Jan 26, 2021 , 17:18:48

అనైతిక బంధం : సోదరిని కాల్చిచంపిన వ్యక్తి

అనైతిక బంధం : సోదరిని కాల్చిచంపిన వ్యక్తి

లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నెరపుతోందనే కోపంతో స్వయానా సోదరిని తలపై కాల్చి చంపిన వ్యక్తి ఉదంతం యూపీలోని మీరట్‌లో వెలుగుచూసింది. 24 గంటల్లో బాధితురాలి వివాహం జరగనుండగా ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. నగరంలోని లిసారి గేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఇస్లామాబాద్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలికి మరో వ్యక్తితో వివాహం నిశ్చయం కావడంతో ప్రేమికుడు ఆమె అభ్యంతరకర ఫోటోలను ఆన్‌లైన్‌లో వైరల్‌ చేశాడు.

దీంతో కోపంతో రగిలిపోయిన బాధితురాలి సోదరుడు పెండ్లికి ముందే ఆమెను పొట్టనపెట్టుకున్నాడు. బాధితురాలు తన సోదరి మరిది ఖాసింతో నాలుగేళ్లుగా సన్నిహితంగా ఉంటోందని పోలీసులు వెల్లడించారు.  ఆమెను వివాహం చేసుకునేందుకు ఖాసిం నిరాకరించాడని చెప్పారు. కాగా, సోదరిని హత్య చేసిన వ్యక్తిని అరెస్ట్‌ చేశామని, నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. 


VIDEOS

logo