గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Sep 05, 2020 , 16:33:13

మాస్కుపై మ‌త్తుమందు చ‌ల్లి.. బాలిక స్పృహ త‌ప్పిన త‌రువాత‌..

మాస్కుపై మ‌త్తుమందు చ‌ల్లి.. బాలిక స్పృహ త‌ప్పిన త‌రువాత‌..

చండీఘ‌ర్ : మాస్కుపై మ‌త్తు మందు చ‌ల్లి.. మైన‌ర్ బాలిక‌కు ఇచ్చి ఆమె స్పృహ త‌ప్పిన త‌రువాత లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు ఓ కామాంధుడు. పోలీసులు తెలిపిన వివ‌రాలు.. పంజాబ్‌లోని జిరాక్‌పూర్ జిల్లాకు చెందిన సంత్‌రాజ్ యాదవ్ అనే కాంట్రాక్ట‌ర్ ప‌ని కోసం కూలీల‌ను వేరే ప్ర‌దేశాల‌కు తీసుకెళ్తుండేవాడు. ఈ క్ర‌మంలో ఆగ‌స్టు 29న కొంత మంది కూలీల‌ను ప‌ని కోసం తీసుకెళ్లాడు.

వారిలో ఓ 16 ఏండ్ల బాలిక ఉండ‌డంతో ఆమెపై స‌ద‌రు కాంట్రాక్ట‌ర్ క‌న్నేశాడు. ఎలాగైనా లోబ‌ర్చుకోవాల‌ని త‌ల‌చి మాస్కుపై మ‌త్తు మందు చ‌ల్లి ఆమెకు ఇచ్చాడు. విష‌యం తెలియ‌ని మైన‌ర్ బాలిక దాన్ని ధ‌రించింది. కాసేప‌టికే మ‌త్తులోకి జారుకోవ‌డంతో బాలిక‌ను వేరే ప్ర‌దేశానికి తీసుకెళ్లి లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. బాలిక స్పృహ‌లోకి వ‌చ్చిన త‌రువాత నిన్ను రేప్ చేశాన‌ని ఎవ‌రికైనా చెబితే చంపేస్తాన‌ని బెదిరించాడు.  

మొదట్లో భ‌య‌ప‌డిన బాలిక‌.. త‌రువాత ధైర్యం తెచ్చుకొని త‌ల్లిదండ్రుల‌కు చెప్ప‌డంతో వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.  ఆ త‌రువాత పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేసిన‌ట్లు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo