మంగళవారం 26 జనవరి 2021
Crime - Nov 01, 2020 , 12:53:00

పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

వికారాబాద్ : జిల్లాలోని తాండూరు నుంచి జీవన్గి వెళ్తున్న ఆర్టీసీ బస్సు బషీరాబాద్ మండలం గంగ్వార్ వద్ద ముందు భాగం కమాన్ కట్టలు విరగడంతో రోడ్డు పక్కకు పంట పొలాల్లోకి బస్సు దూసుకెళ్లింది. డ్రైవర్ చాకచక్యంతో తప్పిన పెను ప్రమాదం తప్పింది. కండక్టర్ సహా ముగ్గురికి గాయాలు కాగా లక్ష్మమ్మ అనే మహిళ కాలు విరిగింది. బస్సులో మొత్తం 27 మంది  ప్రయాణికులు ఉన్నారు .చికిత్స కోసం మహిళలను పోలీసులు దవాఖానకు తరలించారు. ఇదే బస్సు బషీరాబాద్ మండలం గోటికేకుర్దు వద్ద రెండు రోజుల క్రితం ప్రమాదానికి గురి కావడం విశేషం.


logo