గోల్నాక : ఓ వృద్ధురాలు అదృశ్యమైన సంఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం… అంబర్‌పేట గోల్నాక తులసీరాం నగర్‌కు చెందిన నర్సమ్మ (63).. ఓ ఇంట్లో ఒంటరిగా ఉంటోంది.
ఈ నెల 16న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు తెలిసిన ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం కనిపించలేదు. బాధితురాలి కుమారుడు బాలరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.