బైక్ను ఢీ కొట్టిన అయిల్ ట్యాంకర్..ఇద్దరు యువకులు మృతి

మేడ్చల్ మల్కాజిగిరి : ద్విచక్రవాహనాన్ని అయిల్ ట్యాంకర్ ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందిన విషాద ఘటన ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధి అన్నోజిగూడలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి అన్నోజిగూడలోని నారాయణ కళాశాల సమీపంలో ఘట్కేసర్ నుంచి ఉప్పల్ వైపు ద్విచక్రవాహనం(టీఎస్08 జిఎఫ్ 7682)పై దుగ్గిపోగు ప్రణయ్ కుమార్(26), అతని మిత్రుడు జునుగూరి రాజశేఖర్(18) ఉప్పల్ వైపు వెళ్తుండగా.. వెనుకాల నుంచి వేగంగా వచ్చిన అయిల్ ట్యాంకర్(టీఎస్ 29 టీ 0321) ఢీకొట్టింది.
దీంతో ఇద్దరు యువకులు బైక్పై నుంచి ఎగిరి కిందపడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతులు ఘట్కేసర్ పట్టణంలోని అక్షర డయాగ్నస్టిక్ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్లుగా పని చేస్తున్నట్లు తెలిపారు. ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ ఎన్.చంద్రబాబు తెలిపారు.
తాజావార్తలు
- బాధితులకు సత్వర న్యాయం అందించడానికి కృషి
- త్యాగధనుల కృషి ఫలితమే గణతంత్రం
- సీసీఎంబీ పరిశోధనలు అభినందనీయం
- కామునిచెరువు సుందరీకరణపై స్టేటస్కో పొడిగింపు
- సీజనల్ వ్యాధులపై వార్
- రాణిగంజ్ ఆర్యూబీ విస్తరణకు చర్యలు
- ఆటకు లేదు లోటు
- త్రికరణ శుద్ధితో పాలన
- అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి
- సాయం చేసే చేతులే మిన్న