సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Sep 06, 2020 , 15:05:53

బకెట్లో తెగిన మనిషి చెయ్యి.. కలకలం రేపిన ఘటన

బకెట్లో తెగిన మనిషి చెయ్యి.. కలకలం రేపిన ఘటన

రాంచీ: ఒక బకెట్లో మనిషి చేయి తెగి ఉండటం కలకలం రేపింది. జార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని బారియాటు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఒక చోట తెగిన చేయి బకెట్లో ఉండటాన్ని స్థానికులు గమనించి భయాందోళన చెందారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో వారు బకెట్లో ఉన్న తెగిన చేతిని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు జరుపగా ఒక క్యాన్సర్ రోగి చేతిని వైద్యులు తొలగించినట్లు తెలిసింది. దానిని ల్యాబ్‌కు పంపేందుకు ఒక చోట ఉంచగా అది మాయమైనట్లు దవాఖాన సిబ్బంది చెప్పారు. కాగా, తెగిన చేయి ఉన్న బక్కెట్ దవాఖాన నుంచి మరో చోటికి ఎలా చేరిందన్నదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు రాంచీ నగర ఎస్పీ సౌరభ్ తెలిపారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo