మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Aug 26, 2020 , 12:52:45

18 ఏండ్ల బాలిక‌పై అత్యాచారం.. హ‌త్య‌

18 ఏండ్ల బాలిక‌పై అత్యాచారం.. హ‌త్య‌

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ల‌ఖింపూర్ ఖేరీ జిల్లాలో మ‌రో దారుణం జ‌రిగింది. రెండు వారాల క్రితం 13 ఏండ్ల బాలిక‌పై అత్యాచారం చేసి హ‌త‌మార్చిన ఘ‌ట‌న‌ను మరువ‌క ముందే అలాంటిదే మ‌రో ఘ‌ట‌న చోటుచేసుకుంది. జిల్లాలోని నిమ్‌గౌన్ ఏరియాలో ఇంట‌ర్మీడియ‌ట్ చ‌దువుతున్న 18 ఏండ్ల బాలిక‌పై అత్యాచారం, హ‌త్య జ‌రిగింది. బాలిక స్కాల‌ర్ షిప్ కోసం ద‌ర‌ఖాస్తు చేయ‌డానికి స‌మీప ప‌ట్ట‌ణానికి వెళ్లిన స‌మ‌యంలో దుండ‌గులు ఈ ఘాతుకానికి ఒడిగ‌ట్టారు. 

బాలిక ఇంటికి అర కిలోమీట‌ర్ దూరంలోగ‌ల నీటి కుంట ప‌క్క‌న మృత‌దేహం క‌నిపించింద‌ని, మంగ‌ళ‌వారం ఉద‌యాన్నే ప‌శువుల గ‌డ్డి కోసం వెళ్లిన యువ‌కులు మృత‌దేహాన్ని చూసి త‌మ‌కు స‌మాచారం ఇచ్చార‌ని పోలీసులు తెలిపారు. మృత‌దేహంపై మెడ ద‌గ్గ‌ర గాయం ఉంద‌ని, కాలిలో కొంత భాగం వీధి కుక్క‌లు పీక్కుతిన్న‌ట్లు ఉన్న‌ద‌ని వెల్ల‌డించారు. నిందితులు ఎవ‌ర‌నేది ఇంకా గుర్తించ‌లేద‌ని, నిందితులను గుర్తించేందుకు మూడు బృందాల‌ను ఏర్పాటు చేసి ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నామ‌ని ల‌ఖీంపూర్ ఖేరీ ఎస్పీ స‌త్యేంద్ర కుమార్ చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo