శనివారం 05 డిసెంబర్ 2020
Crime - Oct 09, 2020 , 16:36:08

రిషికేశ్‌లో అమెరిక‌న్ మ‌హిళ‌పై అత్యాచారం

రిషికేశ్‌లో అమెరిక‌న్ మ‌హిళ‌పై అత్యాచారం

డెహ్రాడూన్ :  అమెరికాకు చెందిన 37 ఏళ్ల మహిళను రిషికేశ్‌లో స్థానిక నివాసి ఒక‌డు అత్యాచారం చేశాడు. యోగా ప్రియురాలైన ఆమె యోగా గురించి మ‌రింత తెలుసుకునేందుకు యూఎస్ఏ నుండి ఈ ప‌విత్ర, ఆధ్యాత్మిక‌ ప‌ట్ట‌ణానికి విచ్చేసింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. యోగా పట్ల తనకున్న అభిరుచిని పంచుకుంటూ స్నేహం చేసిన వ్యక్తే త‌న‌పై అత్యాచారానికి పాల్ప‌డిన‌ట్లు తెలిపారు. ఈ నెల 5వ తేదీన బాల్కనీ ద్వారా తన గదిలోకి చొరబడి అత్యాచారం చేశాడని మహిళ ఫిర్యాదులో పేర్కొన్న‌ట్లు చెప్పారు. మహిళకు యోగా, డ్రగ్స్‌పై ఉన్న ఇష్ట‌మే ఆమెను నిందితుడికి ద‌గ్గ‌ర చేశాయ‌న్నారు. కాగా తన కొడుకుపై ఉన్న కేసును ఉపసంహరించుకోవాలని నిందితుడి తండ్రి అమెరికన్ మహిళపై ఒత్తిడి తెస్తున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు.