ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Jul 31, 2020 , 13:56:53

ఆవుపై లైంగిక దాడి చేశాడని ఆరోపణ.. వ్యక్తి ఆత్మహత్య

ఆవుపై లైంగిక దాడి చేశాడని ఆరోపణ.. వ్యక్తి ఆత్మహత్య

క్యానింగ్‌ : ఆవుతో అసహజ లైంగిక కార్యకలాపాలకు పాల్పడినట్లు గ్రామస్తులు ఓ వ్యక్తిపై ఆరోపణలు చేయగా మనస్థాపానికి గురైన ఆ వ్యక్తి గురువారం చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ర్టం పరగనాస్ జిల్లాలో చోటు చేసుకుంది. 

వివరాలు.. పరగనాస్‌ జిల్లా గౌతమారా-హత్ఖోలా గ్రామానికి చెందిన గౌతమ్‌ పత్రా (52) స్థానికంగా  వ్యవసాయ పనులు చేసుకొని జీవనం సాగించేవాడు. వారం రోజుల క్రితం గౌతమ్‌ ఆవుపై లైంగిక దాడికి పాల్పడ్డాడని గ్రామస్తులు అతనిపై ఆరోపణలు చేశారు. కనిపించిన ప్రతిఒక్కరూ ఆవుపై లైంగిక దాడి చేశాడని పదే పదే హేళన చేస్తుండడంతో మనస్థాపానికి గురైన గౌతమ్‌ గురువారం చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఇదిలా ఉండగా ఆవుపై లైంగిక దాడి విషయమై కోర్టులో విచారణ కూడా జరగ్గా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు శుక్రవారం పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo