ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Aug 08, 2020 , 19:50:54

ఏపీకి మద్యం అక్రమ తరలింపు.. లారీ పట్టివేత

ఏపీకి మద్యం అక్రమ తరలింపు.. లారీ పట్టివేత

నల్లగొండ : లారీలో ఏపీకి మద్యం అక్రమంగా తరలిస్తుండటాన్ని గుర్తించిన పోలీసులు మద్యాన్ని సీజ్‌ చేసి లారీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి సరిహద్దు చెక్‌పోస్టు వద్ద చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం నుండి ఆంధ్రాకు మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. సుమారు రూ. 4 లక్షల విలువచేసే 54 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.


logo