శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Aug 23, 2020 , 15:44:01

కోజికోడ్‌ విమానాశ్రయంలో అరకిలో బంగారం పట్టివేత

కోజికోడ్‌ విమానాశ్రయంలో అరకిలో బంగారం పట్టివేత

కోజికోడ్ : కోజికోడ్‌ విమానాశ్రయంలో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) శనివారం జెడ్డా నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 500 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. 24 క్యారెట్ల బంగారాన్ని ఇనుప పెట్టెల లోపల పెట్టి  వాటిని తన సామగ్రిలో ఉంచి తీసుకెళ్లేందుకు యత్నిస్తుండగా ఏఐయూ గుర్తించి పట్టుకున్నట్లు కస్టమ్స్ కమిషనరేట్ (ప్రివెంటివ్) తెలిపింది.  కన్నూర్‌కు చెందిన ఏఐయూ బృందం శనివారం షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 1,357 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల కేరళ రాష్ట్రంలోని పలు విమానాశ్రయాల్లో వరుసగా భారీగా బంగారం పట్టుబడుతుండడం చర్చనీయాంశంగా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo