శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Aug 22, 2020 , 15:07:54

రూ. 60.26 ల‌క్ష‌ల బంగారం ప‌ట్టివేత‌

రూ. 60.26 ల‌క్ష‌ల బంగారం ప‌ట్టివేత‌

తిరువ‌నంత‌పురం : అక్ర‌మంగా తీసుకువ‌చ్చిన బంగారాన్ని అధికారులు గుర్తించి ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న కేర‌ళ‌లోని క‌న్నూర్ విమానాశ్ర‌యంలో చోటుచేసుకుంది. షార్జా నుంచి వ‌చ్చిన ఓ ప్ర‌యాణికుడు 1357 గ్రాముల బంగారాన్ని అక్ర‌మంగా తీసుకువ‌చ్చాడు. ప్ర‌యాణికుల త‌నిఖీల్లో భాగంగా ఎయిర్ ఇంట‌లిజెన్స్ యూనిట్ అధికారులు గుర్తించి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప‌ట్టుబ‌డ్డ బంగారం విలువ రూ. 60.26 ల‌క్ష‌లుగా స‌మాచారం. కేసు న‌మోదు చేసి త‌దుప‌రి ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు క‌స్ట‌మ్స్ అధికారులు వెల్ల‌డించారు.


logo