మంగళవారం 19 జనవరి 2021
Crime - Nov 24, 2020 , 12:25:31

పాయువులో బంగారం.. విలువ రూ.25 ల‌క్ష‌లు

పాయువులో బంగారం.. విలువ రూ.25 ల‌క్ష‌లు

కొచ్చి: ఎక్క‌డ ఎన్నిసార్లు ప‌ట్ట‌బ‌డ్డా దేశంలో బంగారం అక్ర‌మ ర‌వాణా కొన‌సాగుతూనే ఉన్న‌ది. తాజాగా కేర‌ళ‌లోని కోజిక్కోడ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో అక్ర‌మ బంగారం ప‌ట్టుబ‌డింది. విమానాశ్ర‌యంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు ఓ ప్ర‌యాణికుడి నుంచి 568 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్ర‌యాణికుడి న‌డ‌క తీరును అనుమానించిన అధికారులు.. అత‌డిని లోప‌లికి తీసుకెళ్లి త‌నిఖీ చేయ‌గా పాయువులో బంగారం దాచుకున్న‌ట్లు బ‌య‌ట‌ప‌డింది. ఆ బంగారం విలువ రూ.25 ల‌క్ష‌లు ఉంటుంద‌ని అధికారులు అంచానా వేశారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.