శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Aug 14, 2020 , 19:29:28

కుళ్లిన స్థితిలో ఎయిమ్స్ వైద్యుడి మృత‌దేహం

కుళ్లిన స్థితిలో ఎయిమ్స్ వైద్యుడి మృత‌దేహం

ఢిల్లీ : కుళ్లిన స్థితిలో ఉన్న ఎయిమ్స్ వైద్యుడి మృత‌దేహాన్ని పోలీసులు నేడు గుర్తించారు. ఈ ఘ‌ట‌న ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీ ఎయిమ్స్ ఆస్ప‌త్రిలో మోహిత్ సింగ్లా ‌పిడియాట్రిక్స్ విభాగంలో వైద్యుడిగా ప‌నిచేస్తున్నారు. గౌతం న‌గ‌ర్‌లో నివాస‌ముంటారు. ఆగ‌స్టు 11న చివ‌రిసారిగా విధుల‌కు హాజ‌ర‌య్యారు. ఇంట్లో సీలింగ్‌కు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. గ‌ది నుంచి దుర్వాస‌న వ‌స్తుండ‌టంతో ఇరుగుపొరుగు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. గ‌ది లోప‌లినుంచి లాక్ చేయ‌బ‌డిఉంది. పోలీసులు త‌లుపులు తెరిచిచూడ‌గా సీలింగ్ ఫ్యాన్‌కు కుళ్లిన స్థితిలో మృత‌దేహం వేలాడుతూ క‌నిపించింది. మోహిత్ సింగ్లా 2006 నుంచి ఒంట‌రిగానే ఆ గ‌దిలో నివ‌సిస్తున్న‌ట్లుగా స‌మాచారం. ఐపీసీ సెక్ష‌న్ 174 కింద కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.


logo