అహ్మదాబాద్ : కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వాలు కఠిన నియంత్రణలు అమలు చేస్తుంటే కొందరు నిర్లక్ష్యంతో మహమ్మారి వ్యాప్తికి కారణమవుతున్నారు. సోమవారం రాత్రి నైట్ కర్ఫ్యూ అమలవుతుండగా అహ్మదాబాద్ లో నడిరోడ్డుపై డ్యాన్స్ చేసిన ఐదుగురు యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
నైట్ కర్ఫ్యూ సమయంలో రోడ్డుపై యువకుల డ్యాన్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో నిందితుల్లో ఒక యువకుడు కారు రూఫ్ పై డ్యాన్స్ చేయడం కనిపించింది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయ్నతాలు ముమ్మరం చేశారు. వీడియోలో కనిపించిన జీజే 27తో ప్రారంభమైన కారు రిజిస్ట్రేషన్ నెంబర్ వివరాల ఆధారంగా వాహనాన్ని పోలీసులు ట్రేస్ చేసే పనిలో పడ్డారు.