శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Jul 18, 2020 , 18:54:21

సర్వీస్‌ రివాల్వర్‌తో తనను తాను కాల్చుకున్న ఏడీజీపీ

సర్వీస్‌ రివాల్వర్‌తో తనను తాను కాల్చుకున్న ఏడీజీపీ

ఇంఫాల్ :  మణిపూర్ పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీపీ) అరవింద్ కుమార్ శనివారం తన నివాసంలో సర్వీస్‌ రివాల్వర్‌తో తనను తాను కాల్చుకున్నాడు. వెంటనే స్థానికులు గుర్తించి అతడిని దవాఖానకు తరలించగా.. అరవింద్‌ ఎందుకు షూట్‌ చేసుకున్నారో తెలియాల్సి ఉంది. అతను ఇంఫాల్‌లోని రెండో మణిపూర్ రైఫిల్ కాంప్లెక్స్‌లో నిర్మించిన ప్రభుత్వ క్వార్టర్స్‌లో నివసిస్తున్నట్లు తెలిసింది. అయితే రివాల్వర్‌తో షూట్‌ చేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని ఇంఫాల్‌ పోలీసులు తెలిపారు. అతడి చర్యతో పోలీసు సిబ్బంది విస్మయంలో ఉన్నారు. ఇదిలా ఉండగా జూన్‌లో అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ ఢిల్లీలో రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీలోని కృష్ణానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo