శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Jul 31, 2020 , 11:50:52

మద్యానికి బానిసై.. ప్రతిరోజు రాత్రి తన కూతురిపై..

మద్యానికి బానిసై.. ప్రతిరోజు రాత్రి తన కూతురిపై..

నోయిడా :  మద్యానికి బానిసై వావివరుసలు మరిచి ప్రతి రోజు కన్న కూతురిపై లైంగికదాడికి ప్పాలడేవాడు ఓ కీచక తండ్రి. ఈ విషయం తెలిసినా పరువు పోతుందని బయటకు పొక్కనీయని తల్లి.. వీరిద్దరి మధ్య ఆ 13 ఏండ్ల బాలిక ప్రతిరోజు నరకం అనుభవించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ర్టం నోయిడాలో జరుగ్గా బుధవారం ఆ కీచకుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

బీహార్‌కు చెందిన ఓ వ్యక్తి నోయిడాలో కూలి పనులు చేసుకుంటూ భార్య, కుమార్తెతో నివాసం ఉండేవాడు. తాగుడుకు బానిసైన వ్యక్తి తన 13 ఏండ్ల కూతురిపై ప్రతిరోజు లైంగిక దాడికి పాల్పడేవాడు. ఈ విషయం భార్యకు తెలిసినా చుట్టుపక్కల వారి ముందు అవమానకరంగా ఉంటుందని బయట పడనీయలేదు. 

రోజు మద్యం సేవించి వచ్చి లైంగికదాడికి పాల్పడుతుండడంతో ఆ బాలిక తీవ్ర అస్వస్థతకు గురయ్యేది. కుమార్తె బాధను చూడలేక తల్లి ధైర్యం చేసి జూలై 24న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకొని ప్రాథమిక దర్యాప్తు అనంతరం నిందితుడిని బుధవారం అరెస్టు చేసినట్లు డీసీపీ శుక్లా తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 376, పోక్సో చట్టం 2012 కింద అతడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo