Crime
- Jan 24, 2021 , 20:35:22
VIDEOS
వేధింపులపై నటి నేహా శర్మ ఫిర్యాదు

హైదరాబాద్ : ఓ యూట్యూబ్ నటి వేధింపులకు గురయింది. తాను నియమించుకున్న డ్రైవర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించి వేధింపులకు పాల్పడుతున్నాడని బాధిత నటి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నేహా శర్మ అనే నటి యూట్యూబ్ ఛానల్లలో నటిగా పనిచేస్తుంది. కొద్ది రోజుల క్రితం షూటింగ్ నిమిత్తం నేహాశర్మ కేరళకు వెళ్లే సమయంలో డ్రైవర్ షేక్ ఇబ్రహీం వెంట ఉన్నాడు. డ్రగ్స్‌కు బానిసైన డ్రైవర్ డబ్బు కోసం తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వేధింపులకు గురి చేస్తున్నాడని ఆమె పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
MOST READ
TRENDING