ఆదివారం 17 జనవరి 2021
Crime - Nov 15, 2020 , 17:29:31

మ‌హిళ హ‌త్య కేసులో నిందితుడు అరెస్టు

మ‌హిళ హ‌త్య కేసులో నిందితుడు అరెస్టు

యాదాద్రి భువనగిరి : భువనగిరి శివారులో ఈ నెల 11న‌ జరిగిన‌ మహిళ హత్య కేసులో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు ఆరే కుమార్‌ అలియాస్‌ చిన్నూను పోలీసులు యాదగిరిగుట్టలో అదుపులోకి తీసుకున్నారు. డీసీపీ నారాయణరెడ్డి నిందితుడిని మీడియా ముందు హాజరుపరిచారు.  

జనగామ జిల్లా పెద్దమడుగుకు చెందిన లక్ష్మి భర్త చనిపోవడంతో హైదరాబాద్‌కు వచ్చింది. ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో పని చేస్తున్న ఆమె.. గత కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ఆర్యకుమార్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఇద్దరు హైదరాబాద్‌ నుంచి భునగిరి శివారులోని నిర్మాణుష్య ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఇద్దరికి డబ్బు విషయంలో గొడవ జరగడంతో ఆర్యకుమార్‌ తన వద్ద ఉన్న సర్కిల్‌ బ్లేడ్‌తో లక్ష్మిని హత్య చేసిన‌ట్లుగా స‌మాచారం.