ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Sep 02, 2020 , 12:54:15

బాచుప‌ల్లిలో బైకును ఢీకొట్టిన డీసీఎం.. వ్య‌క్తి మృతి

బాచుప‌ల్లిలో బైకును ఢీకొట్టిన డీసీఎం.. వ్య‌క్తి మృతి

హైదరాబాద్: నగరంలోని బాచుపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. రెడిమిక్స్ కంపెనీకి చెందిన ఓ డీసీఎం బాచుప‌ల్లి చౌర‌స్తాలో బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ‌వెళ్తున్న చంద్రకాంత్ రెడ్డి అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. చంద్ర‌కాంత్ రెడ్డి డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్ ఉద్యోగిగా గుర్తించారు. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ద‌వాఖాన‌కు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  


logo