శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Jul 09, 2020 , 13:16:37

ఏసీబీ వలలో చిక్కిన షాబాద్‌ సీఐ, ఏఎస్‌ఐ

ఏసీబీ వలలో చిక్కిన షాబాద్‌ సీఐ, ఏఎస్‌ఐ

హైదరాబాద్‌: ఓ భూవివాదంలో లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా షాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ, ఏఎస్‌ఐలు అడ్డంగా బుక్కయ్యారు. సీఐ శంకరయ్య యాదవ్‌, ఏఎస్‌ఐ రాజేందర్‌లు భూవివాదంలో రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డారు. ఇద్దరిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. 

గతంలో షాద్‌నగర్‌ సీఐగా పనిచేసిన శంకరయ్యపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. దీంతో అధికారులు  ఆయనను సైబరాబాద్‌ కమిషనరేట్‌కు అటాచ్‌ చేశారు. ఇటీవలే షాబాద్‌కు సీఐగా వచ్చారు. బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే ఏసీబీకి దొరికిపోయారు.


logo