ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jul 14, 2020 , 15:52:00

ప్రేమ విఫ‌ల‌మైంద‌ని.. యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌

ప్రేమ విఫ‌ల‌మైంద‌ని.. యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌

అమ‌రావ‌తి : ప‌్రాణానికి ప్రాణంగా ఓ అమ్మాయిని ప్రేమించాడు. కానీ ఆ అమ్మాయిని అత‌న్ని ప్రేమ‌ను అంగీక‌రించ‌లేదు. త‌న ప్రేమ విఫ‌ల‌మైంద‌ని ఆ యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ విషాద ఘ‌ట‌న ఏపీలోని కృష్ణా జిల్లాలోని కైక‌లూరు ఎన్జీవో కాల‌నీలో చోటు చేసుకుంది. 

ఎన్జీవో కాల‌నీకి చెందిన రాజు(26).. త‌న మ‌న‌సుకు న‌చ్చిన అమ్మాయిని ప్రేమించాడు. ఆ యువ‌తిది కూడా అదే ప్రాంతం. అయితే ఆమెకు త‌న ప్రేమ విష‌యాన్ని తెలిపాడు. కానీ ఆ యువ‌తి రాజు ప్రేమ‌ను అంగీక‌రించ‌లేదు. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన రాజు.. బ్లేడ్ తో చేయి చేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. 

ఈ అఘాయిత్యానికి పాల్ప‌డే ముందు.. రాజ్ త‌న మిత్రుడికి ఫోన్ చేసి.. ప్రేమ విఫ‌ల‌మైంద‌ని.. ఆ బాధ‌తో తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నాన‌ని చెప్పాడు. మిత్రుడు త‌క్ష‌ణ‌మే రాజు సోదరుడికి ఫోన్ చేసి చెప్పాడు. అత‌ను రాజు ఉన్న ప్రాంతానికి వెళ్లి చూడ‌గా అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లాడు. హుటాహుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా.. వైద్యులు ప‌రీక్షించి రాజు అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు నిర్ధారించారు. మృతుడి నివాసంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. 


logo