సోమవారం 08 మార్చి 2021
Crime - Jan 28, 2021 , 13:20:17

వివాహిత‌కు వేధింపులు.. యువ‌కుడు అరెస్ట్‌

వివాహిత‌కు వేధింపులు.. యువ‌కుడు అరెస్ట్‌

రంగారెడ్డి : ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లం పోచారం గ్రామానికి చెందిన ఓ వివాహిత‌ను పొరుగింటి యువ‌కుడు లైంగిక వేధింపులకు గురి చేశాడు. త‌న‌తో శృంగారం చేయాల‌ని, లేని యెడ‌ల వేరొక‌రితో అక్ర‌మ సంబంధం కొన‌సాగిస్తుంద‌ని మీ భ‌ర్త‌కు చెప్తాన‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాడు. ఆమె ఒంట‌రిగా ఉన్న స‌మ‌యంలో ఇంట్లోకి వెళ్లి వెకిలి చేష్ట‌ల‌కు పాల్ప‌డుతుండ‌టంతో.. వివాహిత విసుగు చెంది మంద‌లించింది. దీంతో కోపం పెంచుకున్న ఆ యువ‌కుడు రూ. 3,400ల‌కు ఓ ఆప్ కాల్‌ను డౌన్‌లోడ్ చేసుకుని దాని ద్వారా ప్ర‌యివేటు నంబ‌ర్ల‌తో ఆ వివాహిత‌కు, ఆమె భ‌ర్త‌కు ఫోన్లు చేసి అస‌భ్య‌క‌రంగా మాట్లాడ‌టం మొద‌లు పెట్టాడు. విసిగిపోయిన ఆ దంప‌తులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టి.. నిందితుడు కొర‌మోని భ‌ర‌త్‌ని బుధ‌వారం అదుపులోకి తీసుకున్నారు. 

VIDEOS

logo