శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Aug 24, 2020 , 19:31:15

ఓఎల్‌ఎక్స్‌లో సెల్‌ఫోన్‌ కొనబోయి మోసపోయిన యువకుడు

ఓఎల్‌ఎక్స్‌లో సెల్‌ఫోన్‌ కొనబోయి మోసపోయిన యువకుడు

ఖమ్మం : ఆన్‌లైన్‌ సెకండ్‌ హ్యాండ్‌ పరికరాల విక్రయ సంస్థ ఓఎల్‌ఎక్స్‌లో ఓ యువకుడు సెలఫోన్‌ కొనబోయి మోసపోయాడు. జూలై 1న ఖమ్మం జిల్లా చింతిర్యాల క్రాస్ రోడ్ అశ్వాపురానికి చెందిన సందీప్‌ అనే యువకుడు ఓఎల్‌ఎక్స్‌లో రెడ్‌మీ నోట్‌ప్రో స్మార్ట్‌ఫోన్‌ను రూ.7వేలకు ఆఫర్‌లో ఉండగా పేటీఎం ద్వారా అవతలి వ్యక్తికి నగదును పంపాడు. మూడు రోజులు దాటినా మొబైల్‌ రాకపోవడంతో అనుమానం వేసి విక్రేత నెంబర్‌కు డయల్‌ చేశాడు. అవతలి నుంచి ‘స్విచాఫ్‌’ అని సమాధానం రావడంతో మోసపోయానని గ్రహించిన సందీప్‌ స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. 

కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైం పోలీసులు ఓఎల్‌ఎక్స్‌ యాప్‌ ద్వారా మోసం చేసిన వ్యక్తి అకౌంట్‌ నెంబర్‌ను ట్రాక్‌ చేసి రూ.2618/-లను బాధితుడు సందీప్ అకౌంట్‌లో జమ చేశారు. అంతే కాకుండా నేరానికి పాల్పడిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్‌ను సీజ్‌ చేయించినట్లు సీఐ అబ్బయ్య తెలిపారు. నగదు కోల్పోయిన యువకుడికి న్యాయం చేసిన సైబర్‌ క్రైం సిబ్బందిని ఎస్పీ సునీల్ దత్ అభినందించారు. 

 లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo