శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Jun 21, 2020 , 19:06:52

హిజ్రాతో స‌హ‌జీవ‌నం.. ఇద్ద‌రూ ఆత్మ‌హ‌త్య‌

హిజ్రాతో స‌హ‌జీవ‌నం.. ఇద్ద‌రూ ఆత్మ‌హ‌త్య‌

పుదుచ్చేరి : ఓ యువ‌కుడు.. హిజ్రాను ఇష్ట‌ప‌డ్డాడు. ఆమెతో త‌న జీవితాన్ని కొన‌సాగించాల‌ని బ‌లంగా నిర్ణ‌యించుకున్నాడు. అత‌ని కుటుంబ స‌భ్యులు ఈ సంబంధాన్ని వ్య‌తిరేకించారు. అయిన‌ప్ప‌టికీ మ‌న‌సారా ప్రేమించిన హిజ్రాతోనే త‌న జీవితం అనుకున్నాడు. హిజ్రాతో నెల రోజుల పాటు స‌హ‌జీవ‌నం కొన‌సాగించాడు. నెల రోజుల‌కే ఇద్ద‌రూ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. 

పుదుచ్చేరిలోని కారైక్కాల్ జిల్లాలోని తిరున‌ల్లూరుకు చెందిన దిలీప్(26)కు శివానీ అనే హిజ్రాతో ఆరు నెల‌ల క్రితం ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఈ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారింది. హిజ్రా వ‌య‌సు 30 ఏండ్లు. వీరిద్ద‌రూ ఒక‌ర్ని విడిచి ఒక‌రు ఉండ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. 

మొత్తానికి వీరి ప్రేమ విష‌యం.. దిలీప్ కుటుంబ స‌భ్యుల‌కు తెలిసింది. దీంతో దిలీప్ ను తీవ్రంగా మంద‌లించారు. శివానీని వ‌దిలి ఉండ‌లేన‌ని అత‌ను త‌న త‌ల్లిదండ్రుల‌కు తెగేసి చెప్పాడు. ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. ఆ త‌ర్వాత కారైక్కాల్ లోని ఒడుదురై ప్రాంతంలో శివానీ, దిలీప్ క‌లిసి ఓ గ‌దిని అద్దెకు తీసుకున్నారు. స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు చోటు చేసుకున్నాయి. మొత్తానికి శ‌నివారం రోజు ఇద్ద‌రు ఇంట్లోని ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. 

స్థానికులు అందించిన స‌మాచారం మేర‌కు పోలీసులు అక్క‌డికి చేరుకుని మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


logo