శనివారం 16 జనవరి 2021
Crime - Dec 06, 2020 , 13:35:01

లాలాపేట్‌లో సెల్ఫీ వీడియో తీసుకుని గృహిణి ఆత్మ‌హ‌త్య‌

లాలాపేట్‌లో సెల్ఫీ వీడియో తీసుకుని గృహిణి ఆత్మ‌హ‌త్య‌

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని లాలాపేట్‌లో ఓ గృహిణి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఆఖ‌రు నిమిషంలో చూసిన చిన్నారులు త‌ల్లిని కాపాడే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుండా పోయింది. ఇంటికి కొద్ది దూరంలో బేక‌రి నిర్వ‌హిస్తున్న తండ్రికి ఇద్ద‌రు పిల్ల‌లు ఫోన్ చేసి చెప్పారు. అత‌ను వ‌చ్చే లోపే ఆమె చ‌నిపోయింది. దీంతో అత‌ను పోలీసుల‌కు స‌మాచారం అందించాడు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలిని లాలాపేట్‌కు చెందిన మంజుల‌గా పోలీసులు గుర్తించారు. 12 సంవ‌త్స‌రాల క్రితం మంజుల‌కు వివాహం కాగా, ఆమె భ‌ర్త లాలాపేట్ ప్ర‌ధాన ర‌హ‌దారిపై అయ్యంగార్ బేక‌రి న‌డుపుతున్నాడు. వీరికి ఇద్ద‌రు కుమారులు తేజ‌స్‌(ఐదో త‌ర‌గ‌తి), రంజిత్‌(ఆరో త‌ర‌గ‌తి) ఉన్నారు.