ఆదివారం 17 జనవరి 2021
Crime - Jan 08, 2021 , 12:14:34

శంషాబాద్‌లో మ‌హిళ దారుణ హ‌త్య‌

శంషాబాద్‌లో మ‌హిళ దారుణ హ‌త్య‌

రంగారెడ్డి : శ‌ంషాబాద్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో దారుణ హ‌త్య‌ జ‌రిగింది. విమానాశ్ర‌యానికి వెళ్లేదారిలో గుర్తు తెలియ‌ని మ‌హిళ మృత‌దేహం ల‌భ్య‌మైంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పూర్తిగా కాలిపోయిన స్థితిలో మ‌హిళ మృత‌దేహం ఉంద‌ని పోలీసులు తెలిపారు. మ‌హిళ‌ను రాత్రి హ‌త్య చేసి ఉండొచ్చ‌ని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి వ‌య‌సు 35 నుంచి 40 ఏండ్ల మ‌ధ్య ఉంటుంద‌ని పేర్కొన్నారు. మ‌హిళ మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న శంషాబాద్ పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృత‌దేహం ల‌భించిన ఏరియాతో పాటు శంషాబాద్‌లో సీసీటీవీ కెమెరా దృశ్యాల‌ను పోలీసులు ప‌రిశీలిస్తున్నారు.